Varthur Santhosh : ఆ పని చేసినందుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. షో నుంచే తీసుకెళ్ళిపోయిన పోలీసులు..
కన్నడ బిగ్‌బాస్ లో వర్తూరు సంతోష్ అనే కంటెస్టెంట్ ఉన్నాడు. ఆవుల సంరక్షణతో పలు వీడియోలు చేసి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాడు సంతోష్. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Kannada Bigg Boss Contestant Varthur Santhosh Arrest From House
Varthur Santhosh : ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ సీజన్లు జరుగుతున్నాయి. తెలుగులో నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ 7వ సీజన్ జరుగుతుంది. అటు కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్ గా బిగ్‌బాస్ 10వ సీజన్ జరుగుతుంది. అయితే కన్నడ బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న ఓ కంటెస్టెంట్ ని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
కన్నడ బిగ్‌బాస్ లో వర్తూరు సంతోష్ అనే కంటెస్టెంట్ ఉన్నాడు. ఆవుల సంరక్షణతో పలు వీడియోలు చేసి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాడు సంతోష్. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇటీవల హౌస్ లో పులి గోరు లాకెట్ ఉన్న చైన్ వేసుకొని కనిపించాడు. ఇది టీవీలో టెలికాస్ట్ అవ్వడంతో పలువురు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అటవీశాఖ అధికారులు ముందు టీవిలో పరిశిలించి అనంతరం బిగ్‌బాస్ షూటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి వర్తూరు సంతోష్ ని బయటకి రప్పించి మెడలో ఉన్న పులిగోరు చెక్ చేయగా అది నిజమైన పులి గోరు అని తెలిసింది. దీంతో అతన్ని వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేసి బిగ్‌బాస్ షో నుంచి తీసుకెళ్లారు. అలాగే ఆ పులిగోరుని స్వాధీనం చేసుకొని ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపించారు.
Also Read : Prabhas Huge Cutout : ప్రభాస్ భారీ కటౌట్ లాంచింగ్ ఈవెంట్ ఫొటోలు..
అయితే ఆ పులిగోరు తమ పూర్వికులు ఇచ్చిందని వర్తోరు సంతోష్ చెప్పినట్టు సమాచారం. అది ఎలా వచ్చినా ప్రస్తుతం అతని దగ్గర ఉన్నందుకు, దానిని అందరికి కనపడేలా చేసినందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ నేరం రుజువైతే దాదాపు మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.