Kichcha Sudeep : బెస్ట్ యాక్టర్.. ఏకంగా స్టేట్ అవార్డునే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. మొన్న షో వద్దన్నాడు.. ఇవాళ అవార్డు వద్దన్నాడు..

ఏకంగా కర్ణాటక స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ నే రిజెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

Kichcha Sudeep : బెస్ట్ యాక్టర్.. ఏకంగా స్టేట్ అవార్డునే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. మొన్న షో వద్దన్నాడు.. ఇవాళ అవార్డు వద్దన్నాడు..

Kannada Star Hero Kichcha Sudeep Rejects Karnataka State Best Actor Details Here

Updated On : January 24, 2025 / 3:42 PM IST

Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించి అనంతరం తన సినిమాలను డబ్బింగ్ చేసి రెగ్యులర్ గా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవలే మ్యాక్స్ అనే సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు కిచ్చ సుదీప్. అయితే గత కొన్ని రోజులుగా సుదీప్ వార్తల్లో నిలుస్తున్నాడు.

కన్నడలో బిగ్ బాస్ మొదలయినప్పటి నుంచి 11 సీజన్లు సుదీప్ హోస్ట్ గా చేసాడు. కానీ ఇటీవల 11వ సీజన్ మధ్యలోనే ఆ షో అయిపోయిన తర్వాత ఇకపై మళ్ళీ బిగ్ బాస్ చేయను, కన్నడ వాళ్లకు ఇందులో ప్రాముఖ్యత లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ఆ షో అయ్యాక బిగ్ బాస్ హోస్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగానే ప్రకటించాడు. దాంతో సుదీప్ వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు సుదీప్.

Also Read : Kalki 2898 AD : వాట్.. ప్రభాస్ సినిమాకు మరీ అంత తక్కువ రేటింగా? బన్నీ, మహేష్, తేజ సజ్జ సినిమాల కంటే కూడా..

ఈసారి ఏకంగా కర్ణాటక స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ నే రిజెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి స్టేట్ అవార్డులు ఇటీవల ప్రకటించింది. అందులో బెస్ట్ యాక్టర్ అవార్డు కిచ్చ సుదీప్ కు పహిల్వాన్ సినిమాకు ప్రకటించారు. దీనిపై సుదీప్ స్పందిస్తూ నాకు అవార్డు వద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కిచ్చ సుదీప్ తన సోషల్ మీడియాలో.. కర్ణాటక ప్రభుత్వానికి, అవార్డు కమిటీ జ్యురి మెంబర్స్ కి బెస్ట్ యాక్టర్ గా నాకు స్టేట్ అవార్డుని ప్రకటించినందుకు ధన్యవాదాలు. అయితే కొంతకాలం క్రితం నా పర్సనల్ కారణాల వల్ల నేను కొంతకాలం వరకు ఎలాంటి అవార్డులు తీసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. నా కంటే బాగా నటించిన వారు చాలా మంది ఉన్నారు, ఆ అవార్డుని వాళ్లకు ఇవ్వండి. వాళ్లలో ఎవరు తీసుకున్నా నాకు సంతోషమే. ఎలాంటి అవార్డులు ఆశించకుండా నేను ప్రజలను ఎంటర్టైన్ చేస్తాను. జ్యురి మెంబర్స్ నాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చి నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. నా నిర్ణయంతో జ్యురి మెంబర్స్ ని, ప్రభుత్వాన్ని నిరాశపరిచి ఉంటే క్షమించండి. మీ పై నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మరోసారి జ్యురి మెంబర్స్ కి, కర్ణాటక ప్రభుత్వానికి నన్ను అవార్డుకు సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు.

దీంతో పలువురు కిచ్చ సుదీప్ ని విమర్శిస్తున్నా చాలా మంది సుదీప్ ని అభినందిస్తున్నారు. తన అవార్డుని వేరే వాళ్లకు ఇవ్వమని ఏ హీరో చెప్తాడు అంటూ కిచ్చ సుదీప్ పై అభినందనలు కురిపిస్తున్నారు.

Also Read : Pushpa 2 Collections : పుష్ప 2 కలెక్షన్స్ 1300 కోట్లా? 2300 కోట్లా? 1800 కోట్లా? నిజం చెప్పండయ్యా..