Kantara: యూఎస్‌లో కాంతార జోరు.. తగ్గేదే లేదుగా!
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘కాంతార’ గురించి అంతటా చర్చ సాగుతోంది. ఈ సినిమాను కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. యూఎస్‌లో కాంతార చిత్రాన్ని చూసేందుకు అక్కడి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Kantara To Touch 1 Million Mark In US
Kantara: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘కాంతార’ గురించి అంతటా చర్చ సాగుతోంది. ఈ సినిమాను కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్‌కు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని కామన్ ఆడియెన్స్ నుండి సెలబ్రిటీల వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Kantara: ‘కాంతార’ కాస్ట్‌లీ మేడ.. అది ఏమిటో, ఎక్కడుందో తెలుసా?
ఈ సినిమాకు కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లో కాంతార చిత్రాన్ని చూసేందుకు అక్కడి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 950K డాలర్ల వసూళ్లు రాబట్టగా, శనివారం నాటికి ఈ సినిమా ఖచ్చితంగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో జాయిన్ అవుతుందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కాంతార చిత్రానికి వస్తున్న సూపర్ రెస్పాన్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించుకున్నారు.
Kantara: కాంతార సినిమాపై బాలీవుడ్ క్వీన్ కామెంట్స్.. ఏమందంటే..?
ఇలా కాంతార చిత్రం కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, హొంబాలే ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించాడు. మరి మున్ముందు కాంతార చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.