Kanya Kumari : ‘కన్యా కుమారి’ మూవీ రివ్యూ.. విలేజ్ ప్రేమకథ.. హీరోయిన్ అదరగొట్టేసిందిగా..

కన్యాకుమారి టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో హీరోయిన్ చీరల గురించి చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.(Kanya Kumari)

Kanya Kumari

Kanya Kumari : నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా తెరకెక్కిన సినిమా ‘కన్యా కుమారి’. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా తెరకెక్కిన ఈ సినిమా నేడు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్స్ లో విడుదలైంది. ముందురోజే ప్రీమియర్లు కూడా వేశారు.(Kanya Kumari)

కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్) చిన్నప్పుడే కన్యాకుమారి(గీత్ సైని)ని లవ్ చేస్తాడు. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని ఇష్టం. కన్యాకుమారి పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలి అని కల. తిరుపతి మాత్రం చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. కానీ కన్యాకుమారి ఇంట్లో సమస్యల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పనిచేస్తుంది. తిరుపతికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే రైతు అని అందరూ వద్దంటారు. కన్యాకుమారి ఏమో అబ్బాయి జాబ్ చేయాలి, తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయడానికి సపోర్ట్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.

తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి రైతు అని కన్యాకుమారి పట్టించుకోదు. కానీ తిరుపతి మళ్ళీ చిన్నప్పటి తన ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతూ ఉంటాడు. మొత్తానికి ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అదే సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. తన కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా తిరుపతి జాబ్ లో కూడా జాయిన్ అవుతాడు కన్యాకుమారి కోసం. మరి వీరిద్దరి ప్రేమ నిలబడింది? తిరుపతి జాబ్ మానేసి మళ్ళీ వ్యవసాయానికి వెళ్లాడా? కన్యాకుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిందా? కన్యాకుమారి ఓకే చేసిన సంబంధం ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..

సినిమా విశ్లేషణ..

కన్యాకుమారి టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో హీరోయిన్ చీరల గురించి చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఇది ఒక రొటీన్ లవ్ స్టోరీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. రెండు భిన్న ధ్రువాల లాంటి అమ్మాయి – అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వాళ ప్రేమ సక్సెస్ అయిందా లేదా? వాళ్ళ కెరీర్స్ కోసం వాళ్ళు ఏం చేసారు? వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు ఏంటి అని రెగ్యులర్ లవ్ స్టోరీలలాగానే సాగుతుంది.

రెగ్యులర్ ప్రేమకథే అయినా కాస్త కొత్తగా ఫ్రెష్ గానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా క్యూట్ లవ్ స్టోరీతో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా హీరో హీరోయిన్ కోసం ఏదైనా చేయడం అనేది బాగానే కనెక్ట్ అవుతుంది. కానీ వీరిద్దరి మధ్య కెరీర్స్ గురించి ఒక గొడవ మొదలవుతుంది. అక్కడ్నుంచి సినిమాని బాగా సాగదీసారు. ఏడుపులు, ఎమోషన్స్ తో కాస్త నీరసం తెప్పిస్తారు. సెకండ్ హాఫ్ మిడిల్ నుంచి సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తాం. అయిపోయినట్టే క్లైమాక్స్ సీన్ లాగే ఉంటుంది కానీ క్లైమాక్స్ కాదు. ఎండింగ్ కాస్త పర్ఫెక్ట్ గా, సింపుల్ గా రాసుకుంటే బాగుండేది. అక్కడక్కడా కామెడీ అయితే వర్కౌట్ అయింది. సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తీసుకోవడం, అక్కడి యాస అందరూ బాగా మాట్లాడటం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కథని టైటిల్ కి తగ్గట్టు హీరోయిన్ చుట్టూ నడిపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. కన్యాకుమారి టైటిల్ పాత్రలో నటించిన గీత్ సైని అదరగొట్టింది చెప్పొచ్చు. విలేజ్ అమ్మాయిలా, చదువుకోవాలి జాబ్ చేయాలి అని ఓ పట్టుదల ఉన్న అమ్మాయిలా, బట్టల షాప్ లో చీరలు అమ్మే పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడమే కాక డైలాగ్స్ బాగా చెప్తూ కొన్ని సీన్స్ లో తన కళ్ళతోనే నటించి మెప్పించింది.

ఈ సినిమా తర్వాత గీత్ సైనికి తెలుగులో అవకాశాలు రావొచ్చేమో. కొత్త అబ్బాయి శ్రీచరణ్ వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న కుర్రాడి పాత్రలో, లవ్ స్టోరీలో బాగానే నటించాడు. భద్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు కొత్తవాళ్లు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Manchu Manoj : తను చెన్నైలో పెద్ద రౌడీ.. ప్రభాస్ హీరోయిన్ పై మంచు మనోజ్ కామెంట్స్ వైరల్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమా అంతా రియల్ లొకేషన్స్, పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తీయడంతో విజువల్స్ అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. రొటీన్ ప్రేమ కథ అయినా ఎక్కువ బోర్ కొట్టకుండా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. లవ్ కి సంబంధించి డైలాగ్స్ మాత్రం బాగా రాసారు. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ లో కొంత షార్ప్ కట్స్ చేయాల్సింది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కన్యాకుమారి’ సినిమా ఒక రొటీన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథే అయినా ఎక్కువ బోర్ కొట్టించకుండా బాగానే తీశారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.