కపిల్‌కు కూతురు పుట్టింది!

బాలీవుడ్‌ కమెడియన్‌, నటుడు కపిల్‌ శర్మ భార్య గిన్నీ చరాత్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు..

  • Publish Date - December 10, 2019 / 07:53 AM IST

బాలీవుడ్‌ కమెడియన్‌, నటుడు కపిల్‌ శర్మ భార్య గిన్నీ చరాత్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు..

బాలీవుడ్‌ కమెడియన్‌, నటుడు కపిల్‌ శర్మ తండ్రి అయ్యాడు. గతేడాది తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను కపిల్‌ వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య 2018 డిసెంబరు 12న వీరి వివాహ వేడుక పంజాబీ సంప్రదాయ ప్రకారం జరిగింది. కపిల్‌ తన హోం టౌన్‌ అమృత్‌సర్‌లో డిసెంబరు 14న సన్నిహితుల కోసం, ముంబైలో డిసెంబరు 24న ఇండస్ట్రీ ప్రముఖుల కోసం.. రెండు రిసెప్షన్‌ పార్టీలు ఇచ్చాడు. తాజాగా తన భార్య పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

‘అమ్మాయి పుట్టింది. మీ అందరి ఆశీస్సులు కావాలి. జై మాతాదీ… లవ్‌ యు ఆల్‌’ అంటూ తొలిసారి తండ్రి అయిన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తనకు కూతురు జన్మించిన విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలియజేశాడు. హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్‌, సింగర్‌ గురురాంధవా సహా పలువురు సెలబ్రిటీలు మరియు నెటిజన్ల నుంచి కపిల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ఫేమస్‌ అయిన కపిల్‌ శర్మ.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్‌గా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. ప్రస్తుతం ‘ద కపిల్‌ శర్మ షో’తో కపిల్‌ బిజీగా ఉన్నాడు.