Karnataka CM Impressed With NTR Kannada Speech
NTR: కన్నడ దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. పునీత్‌తో తారక్‌కు ఉన్న మంచి స్నేహబంధం గురించి కూడా అందరికీ తెలిసిందే. వారి స్నేహం చాలా బలంగా ఉన్న కారణంగానే పునీత్ మరణవార్తను తారక్ తట్టుకోలేకపోయాడని ఆయన సన్నిహితులు గతంలో తెలిపారు.
NTR: మహిళ కోసం కుర్చీ తుడిచిన ఎన్టీఆర్.. ఆమె ఎవరు?
అయితే తన ఆప్రమిత్రుడు ఈ లోకంలో లేకున్నా, ఆయనకు దక్కుతున్న గౌరవంలో తాను పాల్గొనాలని తారక్ నిన్న బెంగళూరుకు వెళ్లాడు. ఇక ఈ క్రమంలో పునీత్ అభిమానులను ఉద్దేశించి, కన్నడ ప్రజలను ఉద్దేశించి తారక్ స్పీచ్ అక్కడున్న వారితో పాటు టీవీల్లో చూసినవారిని సైతం ఆకట్టుకునేలా ఉంది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ల ముందు తారక్ కన్నడలో చేసిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.
NTR: తారక్‌కు కథ వినిపించిన మరో డైరెక్టర్.. ఎవరంటే?
ముఖ్యంగా కర్ణాటక సీఎం తారక్ కన్నడ స్పీచ్‌కు ఫిదా అయ్యాడట. ఎన్టీఆర్ కన్నడను అంత స్పష్టంగా మాట్లడటం ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేసిందట. అయితే తారక్ తల్లిది కర్ణాటక కావడంతో ఆయన కన్నడ భాష ఇంత స్పష్టంగా మాట్లాడగలడని అందరికీ తెలిసిందే. ఏదేమైనా నిన్న జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలో తారక్ స్పీచ్ హైలైట్‌గా నిలవడం విశేషమని చెప్పాలి.