NTR: తారక్‌కు కథ వినిపించిన మరో డైరెక్టర్.. ఎవరంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇంకా షూటింగ్ మొదలుకాకపోవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు తారక్‌తో ఓ సినిమా చేసేందుకు మరో డైరెక్టర్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

NTR: తారక్‌కు కథ వినిపించిన మరో డైరెక్టర్.. ఎవరంటే?

Hanu Raghavapudi Narrates Story To NTR

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇంకా షూటింగ్ మొదలుకాకపోవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించేందుకు కొరటాల అండ్ టీమ్ ప్రయత్నిస్తోంది.

NTR: మహిళ కోసం కుర్చీ తుడిచిన ఎన్టీఆర్.. ఆమె ఎవరు?

కాగా, ఈ సినిమా తరువాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. అయితే, ఇప్పుడు తారక్‌తో ఓ సినిమా చేసేందుకు మరో డైరెక్టర్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ‘సీతా రామం’ అనే క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి, ఈసారి ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేస్తున్నాడట.

NTR: అతిధిగా కాదు అప్పు స్నేహితుడిగానే ఇక్కడకి వచ్చా.. ఎన్టీఆర్!

ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని భావించిన హను, ఇటీవల ఆయన్ను కలిసి ఈ కథకు సంబంధించిన స్టోరీలైన్ నెరేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హను చెప్పిన స్టోరీలైన్ ఎన్టీఆర్‌కు నచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ తారక్ హనుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం, ఆయన తారక్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడా అనే ఆసక్తి పెరిగిపోతుంది. ఇక ఈ డైరెక్టర్ స్టైలిష్ టేకింగ్‌లో స్పెషలిస్ట్. కాబట్టి, హను దర్శకత్వంలో తారక్‌ను మరింత స్టైలిష్‌గా చూడటం ఖాయం. మరి నిజంగానే హను కథకు తారక్ ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.