Kantara : కాంతార సినిమా ఎఫెక్ట్.. వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చాలా మందికి చేయూత..
ఈ సినిమాలో కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ముఖ్యంగా భూతకోల నృత్యకారులను అద్భుతంగా చూపించారు. వారి కష్టాలని, వారి ట్యాలెంట్ ని సినిమాలో చూపించారు. దీనిని కన్నడ ప్రజలు అభినందిస్తున్నారు. సినిమా రీచ్ పెరగడంతో................

Karnataka government has taken a sensational decision with Kantara movie effect
Kantara : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సినిమా ‘కాంతార’. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి అక్కడ మంచి కలెక్షన్లని సాధించింది. దీంతో గత వారం తెలుగు, హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దేశమంతటా ఇప్పుడు కాంతార సినిమా పేరే వినిపిస్తుంది.
ఈ సినిమాలో కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ముఖ్యంగా భూతకోల నృత్యకారులను అద్భుతంగా చూపించారు. వారి కష్టాలని, వారి ట్యాలెంట్ ని సినిమాలో చూపించారు. దీనిని కన్నడ ప్రజలు అభినందిస్తున్నారు. సినిమా రీచ్ పెరగడంతో పాటు ఈ భూతకోల నృత్యకారులకు కూడా పేరు వస్తుంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ సినిమా చూసిన తర్వాత ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
దీని గురించి కర్ణాటక ప్రభుత్వ సాంసృతిక శాఖ మంత్రి సునీల్ కుమార్ కాకర్ల అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ అధికారికంగా ట్వీట్ చేస్తూ.. ”కర్ణాటకలో దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవిస్తున్న వారిలో 60 ఏళ్ళు దాటిన వారికీ బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా ఈ భూతకోల ఒక ప్రత్యేక ఆరాధనగా ఉంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి, మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు” అని తెలిపారు.
60 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟ ದೈವ ನರ್ತಕರಿಗೆ ಪ್ರತಿ ತಿಂಗಳು 2000 ರೂ. ಮಾಸಾಶನ ನೀಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿದ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @BSBommai ಅವರ ನೇತೃತ್ವದ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮತ್ತು ಸಚಿವರಾದ ಶ್ರೀ @karkalasunil ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. pic.twitter.com/PrVjV2YAEf
— P C Mohan (@PCMohanMP) October 20, 2022
ಕರ್ನಾಟಕ ಸಂಸ್ಕೃತಿ,ಆಚರಣೆಗಳ ನೆಲೆಬೀಡು. ಅದರಲ್ಲಿ ಅವಿಭಜಿತ ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯ ಭೂತಾರಾಧನೆಯು ಸಹ ಒಂದು.ಭೂತಾರಾಧನೆಯಲ್ಲಿ ದೈವ ನರ್ತನ ಮಾಡುವ ಕಲಾವಿದರ ಹಿತದೃಷ್ಟಿಯನ್ನು ಗಮನಿಸಿ,60 ವರ್ಷ ತುಂಬಿದ ದೈವನರ್ತಕರಿಗೆ ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ ವತಿಯಿಂದ ಮಾಹೆಯಾನ 2 ಸಾವಿರ ಮಾಸಾಶನ ನೀಡಲು ನಿರ್ಧರಿಸಲಾಗಿದೆ. @BJP4Karnataka pic.twitter.com/svxnkl4zju
— Sunil Kumar Karkala (@karkalasunil) October 20, 2022