Toxic: టాక్సిక్ మేకర్స్ కి మహిళా కమిషన్ షాక్.. బోల్డ్ సీన్స్ పై సీరియస్.. టీజర్ ను వెంటనే తొలగించాలట!

టాక్సిక్(Toxic) టీజర్‌లో బోల్డ్ కంటెంట్‌పై కర్ణాటక మహిళా కమిషన్ సీరియస్‌గా అయ్యింది.

Toxic: టాక్సిక్ మేకర్స్ కి మహిళా కమిషన్ షాక్.. బోల్డ్ సీన్స్ పై సీరియస్.. టీజర్ ను వెంటనే తొలగించాలట!

Karnataka Women Commission serious about bold content in Toxic teaser.

Updated On : January 13, 2026 / 11:36 AM IST
  • టాక్సిక్ టీజర్ పై మహిళా కమిషన్ సీరియస్
  • బోల్డ్ సీన్స్ వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు
  • సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ ఆదేశాలు

Toxic: కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తరువాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్(Toxic) మూవీపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, హీరో యష్ కూడా ఈ సినిమాను చాలా గ్యాప్ తీసుకొని ఒకే చేశాడు.

Ashwini: బిగ్ బాస్ బ్యూటీ అశ్విని.. స్టన్నింగ్ లుక్స్ కేక.. ఫొటోలు

యష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా టాక్సిక్ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. హాలీవుడ్ రేంజ్ లో వచ్చిన ఈ టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ టీజర్. అయితే, చాలా మంది నుంచి వినిపించిన మాట ఏంటంటే, ఈ టీజర్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ అయ్యింది అని. టీజర్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువయ్యింది అంటూ ఓపెన్ గానే నెగిటీవ్ కామెంట్స్ చేశారు.

అయితే, తాజాగా ఈ టీజర్ లో ఉన్న బోల్డ్ సీన్స్ పై కర్ణాటక మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. టాక్సిక్ సినిమా టీజర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అశ్లీల దృశ్యాలు సమాజంపై తప్పుడు ప్రభావం చూపుతాయని, ఆ టీజర్‌ను వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అలాగే, ఈ టీజర్ విడుదలై తగిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోరింది. మరి మహిళా కమిషన్ ఆదేశాలపై టాక్సిక్ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.