కార్తికి కొడుకు పుట్టాడు..
Karthi Blessed with a Baby Boy: యంగ్ హీరో కార్తి తండ్రయ్యారు. తమకు బాబు పుట్టాడంటూ మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన సంతోషాన్ని షేర్ చేస్తూ డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్ చెప్పారు.
2011 ఏప్రిల్ 29న Ranjani Chinnaswamy తో కార్తి నిశ్చితార్థం జరిగింది. 2011 జూలై 3న వివాహం జరిగింది. 2013 జనవరి 11న వీరికి పాప Umayaal జన్మించింది. 2020 అక్టోబర్ 20 ప్రత్యేకమైన రోజు బాబు పుట్టాడు. సూర్య తమ్ముడికి బాబు పుట్టిన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ Dr. Nirmala Jayashankar and team కు కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్ నటుడు శివకుమార్ తనయుడు, సూర్య తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తి అతితక్కువ సమయంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపుతో పాటు మంచి మార్కెట్ కూడా ఏర్పరచుకున్నారు. తెలుగు నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని ప్రశంసలందుకుంటున్నారు కార్తి.
Dear friends and family, we are blessed with a boy baby. We can’t thank enough our doctors and nurses who took us through this life changing experience. ?? need all your blessings for the little one. Thank you god!
— Actor Karthi (@Karthi_Offl) October 20, 2020
We are blessed! Thank you yet again Dr. Nirmala Jayashankar and team ?????? https://t.co/gpzkWZQIYF
— Suriya Sivakumar (@Suriya_offl) October 20, 2020
