Karthik Aaryan: బాలీవుడ్‌కు హిట్ ఇచ్చాడు.. కరోనా బారిన పడ్డాడు!
బాలీవుడ్‌లో గతకొంత కాలంగా సరైన హిట్ లేకపోవడంతో అటు అభిమానులు, ఇటు సినీ విశ్లేషకులు కూడా ఆందోళన చెందుతూ వచ్చారు. నార్త్‌లో తిరిగి బ్లాక్‌బస్టర్ అని చెప్పుకోతగ్గ....

Karthik Aaryan Tests Corona Positive
Karthik Aaryan: బాలీవుడ్‌లో గతకొంత కాలంగా సరైన హిట్ లేకపోవడంతో అటు అభిమానులు, ఇటు సినీ విశ్లేషకులు కూడా ఆందోళన చెందుతూ వచ్చారు. నార్త్‌లో తిరిగి బ్లాక్‌బస్టర్ అని చెప్పుకోతగ్గ సినిమా ఎప్పుడు వస్తుందా అని వారందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. స్టార్ హీరోల సినిమాలు అలా వచ్చి, ఇలా పోతుండటంతో, బాలీవుడ్‌ను కాపాడే వారు ఎవరా అని వారు ఆతృతగా చూశారు. ఇక సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తుండటం కూడా వారి ఆందోళనకు కారణంగా నిలిచాయి.
Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?
దీంతో బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భులయ్యా 2’ సినిమాకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. కామెడీ హార్రర్ మూవీగా వచ్చిన ‘భూల్ భులయ్యా’కు సీక్వెల్ మూవీగా వచ్చిన ఈ సినిమాను చూసేందుకు బాలీవుడ్ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ గౌరవాన్ని కాపాడిందంటూ పులువురు సినీ ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమాను ఆకాశానికెత్తారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న హీరో కార్తీక్ ఆర్యన్, హఠాత్తుగా ఓ చేదు వార్తను తన అభిమానులతో పంచుకున్నాడు.
అంతా పాజిటివ్‌గా సాగుతున్న సమయంలో, కరోనా కూడా ఓర్వలేకపోయిందని.. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కార్తీక్ ఆర్యన్ తాజాగా వెల్లడించాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆయన వెల్లడించాడు. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లుగా తెలిపాడు. ఏదేమైనా బాక్సాఫీస్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్, ఇలా కరోనా బారిన పడటంతో అందరూ అవాక్కవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు కోరుతున్నారు.
Sab kuch itna Positive chal raha tha,
Covid se raha Nahi Gaya ? pic.twitter.com/vYlXAUsOyl— Kartik Aaryan (@TheAaryanKartik) June 4, 2022