Bhaje Vayu Vegam : అఫీషియల్.. కార్తికేయ ‘భజే వాయు వేగం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ.
Bhaje Vayu Vegam OTT Release : జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. ఆయన నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్సైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ను పంచుకుంది.
Jani Master : జానీ మాస్టర్ సెన్సేషనల్ ప్రెస్ మీట్.. తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ..
You showered us with love in theaters 🫶🏻 here we are sending back the love straight to your home on June 28th @NetflixIndia 🤩#BhajeVaayuVegam pic.twitter.com/ghGf79KdNj
— Kartikeya (@ActorKartikeya) June 24, 2024
కథ విషయానికొస్తే.. చిన్నప్పుడు వెంకట్(కార్తికేయ) వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో రాజు(రాహుల్) వాళ్ళ నాన్న లచ్చన్న(తణికెళ్ల భరణి) వెంకట్ ని దగ్గరికి తీసుకుంటాడు. వెంకట్ కి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో క్రికెట్ మీదే ఫోకస్ పెడతాడు. కెరీర్ కోసం వెంకట్, రాజు ఇద్దరూ హైదరాబాద్ కు వెళ్తారు. రాజుకి బ్యాక్ డోర్ జాబ్ కోసం లచ్చన్న ఊళ్లో పొలం అమ్మేసి డబ్బులు ఇస్తాడు. మరోవైపు వెంకట్ క్రికెట్ బాగా ఆడినా స్టేట్ టీంలోకి తీసుకోవాలంటే 10 లక్షలు అడగడంతో డబ్బులు లేకపోవడంతో బెట్టింగులు వేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ అని తెలియడంతో రాజు జాబ్ పోతే ఓ హోటల్లో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ విషయాలు ఏవి వాళ్ళ నాన్నకు తెలియకుండా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మాత్రం బాగా సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు.
Pawan Kalyan : ఫస్టు సినిమా హీరోయిన్ను కలిసిన డిప్యూటీ సీఎం..
అనుకోకుండా ఈ విషయం వాళ్ల నాన్నకు తెలిసి హాస్పిటల్లో చేరుతారు. వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించడానికి 20 లక్షలు కావాల్సి వస్తుంది. డబ్బులు కోసం వెంకట్ పెద్ద బెట్టింగ్ వేస్తాడు. అదే సమయంలో రాజు కూడా డబ్బులు ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. అదే సమయంలో వెంకట్ లవర్ ఇందు ఓ ట్విస్ట్ ఇస్తుంది. అసలు వాళ్ళ నాన్న ఆపరేషన్ కి డబ్బులు వచ్చాయా? వెంకట్ బెట్టింగ్ లో గెలిచాడా? ఇందు ఏం ట్విస్ట్ ఇచ్చింది.? హైదరాబాద్ మేయర్ జార్జ్, వాళ్ళ తమ్ముడు డేవిడ్ కి, వెంకట్ కి సంబంధం ఏంటి అని తెలియాలంటే సినిమాని తెరపై చూడాల్సిందే.