Kartikeya Gummakonda : చిరంజీవి పై వస్తున్న విమర్శలకు కార్తికేయ రియాక్షన్.. అలా అవ్వడం నేరమా..?

భోళాశంకర్ విషయంలో చిరంజీవి పై వచ్చిన విమర్శలుకు హీరో కార్తికేయ రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kartikeya Gummakonda : చిరంజీవి పై వస్తున్న విమర్శలకు కార్తికేయ రియాక్షన్.. అలా అవ్వడం నేరమా..?

Kartikeya Gummakonda reaction on trolls on chiranjeevi about bholaa shankar

Updated On : August 18, 2023 / 9:03 PM IST

Kartikeya Gummakonda : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల (ఆగష్టు) 25న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ పనిలో ఉన్న కార్తికేయ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. భోళాశంకర్ (Bholaa Shankar) విషయంలో చిరంజీవి (Chiranjeevi) పై వస్తున్న విమర్శలు గురించి మాట్లాడాడు.

Varun Tej : మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్..

“ఒక సినిమా బాగోలేదు, నచ్చలేదు అని అనడంలో ఎవరికి ఇబ్బంది ఉండదు. కాని అలా కాకుండా ఒక వ్యక్తిని పర్సనల్ గా టార్గెట్‌ చేస్తూ మాటలు అంటుంటే బాధ అనిపిస్తుంది. ఆయన్ని అలా అనేవారిని చూస్తుంటే వారిది చిన్న మనస్తత్వం ఏమో అని అనిపిస్తుంది. ఒక్క చిరంజీవి గారినే కాదు, అలా ఏ నటుడిని అనడం సరికాదు. అయినా ఒక సినిమా ఆడకపోతే అది నేరమా?” అంటూ ప్రశ్నించాడు. అలాగే.. ‘చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో కష్టమైన ఒడిదొడుకులు ఎదురుకొని ఉంటారని, ఇలాంటి చిన్న చిన్న వాటికీ ఆయన ఫీలవ్వకుండా ముందుకు సాగుతారని’ తాను భావిస్తున్నట్లు కార్తికేయ చెప్పుకొచ్చాడు.

Varun Tej : ఈసారి ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?

ఇక బెదురులంక సినిమా ట్రైలర్ ని రామ్ చరణ్ (Ram Charan) చేతులు మీదుగా రిలీజ్ చేయించిన కార్తికేయ.. తన సూపర్ హిట్ మూవీ RX100 ట్రైలర్ ని కూడా చరణే రిలీజ్ చేసినట్లు గుర్తు చేశాడు. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో తన పేరు కూడా ‘శివ’ అని పేర్కొన్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 2012 యుగాంతం రూమర్ ని కథాంశంగా తీసుకోని కొత్త దర్శకుడు క్లాక్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.