కథనం కదులుతుంది
అనసూయ అసోసియేట్ డైరెక్టర్‌గా నటిస్తున్న సినిమా కథనం.

అనసూయ అసోసియేట్ డైరెక్టర్‌గా నటిస్తున్న సినిమా కథనం.
యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ.. నటిగా క్షణం, గూడాఛారి, రంగస్థలం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అనసూయ ప్రధాన పాత్రలో కథనం అనే సినిమా తెరకెక్కుతుంది. గాయత్రి ఫిలింస్, ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, నరేద్ర రెడ్డి, శర్మ చుక్కా కలిసి నిర్మిస్తుండగా, రాజేష్ నాదెండ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కథనం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో అనసూయ.. అసోసియేట్ డైరెక్టర్‌గా నటిస్తుంది. త్వరలో కథనం టీజర్ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్, రణధీర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : సతీష్ ముత్యాల, సంగీతం : సునీల్ కశ్యప్.
వాచ్ మోషన్ పోస్టర్…