Katrina Kaif: ప్రెగ్నెంట్ అయిన కత్రినా.. వీడియో వైరల్!

సెలబ్రిటీలపై నెట్టింట స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్ నుండి వాళ్ళు ధరించే దుస్తులు, చెప్ప్పుల వరకు సోషల్ మీడియా చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇక, నటీనటుల రిలేషన్‌షిప్స్ గురించి..

Katrina Kaif: ప్రెగ్నెంట్ అయిన కత్రినా.. వీడియో వైరల్!

Katrina Kaif

Updated On : April 12, 2022 / 8:25 PM IST

Katrina Kaif: సెలబ్రిటీలపై నెట్టింట స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్ నుండి వాళ్ళు ధరించే దుస్తులు, చెప్ప్పుల వరకు సోషల్ మీడియా చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇక, నటీనటుల రిలేషన్‌షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ గురించి.. ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాల గురించి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఒకవైపు బాలీవుడ్ లవ్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లిపై తెగ ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా మరో బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Katrina Kaif: పెళ్ళైనా.. దాచుకొనేదేలే!

బాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను ప్రేమించి గతేడాది పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుంచి తన భర్త విక్కీతో ముంబైలోనే కాపురం పెట్టింది. కత్రినా కైఫ్, విక్కీ.. పెళ్లి అయినప్పటి నుండి వీరి పర్సనల్ లైఫ్‌లోని చిన్న చిన్న ఆనందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కపుల్ గోల్స్‌ను సెట్ చేస్తున్నారు. అయితే, అప్పుడే కత్రినా తల్లి కాబోతుందని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Katrina Kaif Vicky Kaushal : అంగరంగ వైభవంగా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి… పిక్స్ వైరల్

తాజాగా కత్రినా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. వైరల్ భవాని ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఎయిర్ పోర్ట్ లో కత్రినా వీడియో పోస్ట్ చేసింది. అందులో క్యాట్ వాకింగ్ స్టైల్ ను చూసిన కొందరు నెటిజన్లు క్యాట్ ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ 38 ఏళ్ల క్రేజీ హీరోయిన్ ఇప్పుడు తల్లి కాబోతుంది అనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే కత్రీనా కైఫ్‌ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. మరి దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే ఈ జంట రెస్పాండ్ అయితేనే తెలిసేది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)