ఆలియా, దీపిక నాకు మంచి ఫ్రెండ్స్ – కత్రినా

బాలివుడ్ డాన్సింగ్ క్వీన్ కత్రినా కైఫ్ శత్రువులని కూడా మిత్రులుగా చేసుకోవడమే తన పాలసీ అంటోంది. అంతా నా వాళ్లే అంటూ అందరినీ కలుపుకుని పోతోంది. తనకి నష్టం కలిగించిన వాళ్లు తనవల్ల నష్టపోయిన వాళ్లు..ఇలా అందరినీ కలుపుకుని పోతోంది. శతృవుల్ని పెంచుకోవడం కన్నా ఫ్రెండిషిప్ చేయడమే తనకిష్టమని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కత్రినా కామెంట్ చేసింది. అంతేకాదు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ తో గతంలో ప్రేమాయణం నడిపించిన దీపిక ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న ఆలియా ఇద్దరూ తనకి మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది.
రణ్ బీర్ కపూర్ తో దీపిక పదుకొణె డీప్ లవ్ లో ఉన్న టైంలో కత్రినా, రణ్ బీర్ ని తనవైపు తిప్పుకుంది. అప్పట్లో కత్రినా చేసిన పనికి దీపిక, రణ్ బీర్ కి బ్రేకప్ చెప్పి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. తర్వాత రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడటంతో అన్నీ మర్చిపోయింది. ఇక అవన్నీ పక్కనపెట్టి కత్రినా గతేడాది జరిగిన దీపిక, రణ్ వీర్ సింగ్ మ్యారెజ్ రిసెప్షన్ కి హాజరైంది. అంతేకాదు మిడ్ నైట్ పార్టీలో పాల్గొని హ్యాపీగా ఎంజాయ్ చేసింది.
ప్రస్తుతం తన మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న ఆలియా భట్ మీద కూడా తనకి ఎలాంటి కోపం లేదంటోంది కత్రినా. అంతేకాదు ఆలియా బర్త్ డేకి స్పెషల్ గా విష్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో రణ్ బీర్, ఆలియాని హగ్ చేసుకుని మరీ కంగ్రాట్స్ చెప్పింది. ఇలా అందరినీ కలుపుకునిపోతూ ఓన్లీ ఫ్రెండ్స్ నో ఎనిమీస్ అంటోంది కత్రినా.