Boyapati Srinu: ఐకాన్ స్టార్ సినిమా కోసం మహానటి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రెండు పార్టులుగా రాబోతున్న పుష్పలో డిసెంబర్ 17న తొలి..
Boyapati Srinu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రెండు పార్టులుగా రాబోతున్న పుష్పలో డిసెంబర్ 17న తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ ప్రచారం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ మరో సినిమా చేయబోతున్నాడని.. దీని కోసం బ్యాకెండ్ వర్క్ కూడా మొదలు పెట్టారని ప్రచారం జరుగుతుంది.
Venkatesh: ఎఫ్ 3 టీమ్‌కి వెంకీ మామ స్పెషల్ ట్రీట్..!
ఆ మధ్య ఓ వేదికపై నిర్మాత అల్లు అరవింద్ సైతం తమ బ్యానర్లో బోయపాటి సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. బన్ని కోసం బోయపాటి అదిరిపోయే ఓ మాస్ స్ర్కిప్ట్ ని సిద్దం చేసినట్లు మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా బన్నీలో మాస్ యాంగిల్ ను బయటపెట్టగా.. మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఎలా ఉంటుందా అని ఆసక్తిగా మారింది.
Parineeti Chopra: చూపులతోనే బ్లాక్ మ్యాజిక్ చేసే పరిణీతి!
ఇదిలా ఉండగానే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మహానటిని ఎంపిక చేసుకున్నట్లు ఇప్పుడు మరో కథనం వైరల్ గా మారింది. కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ మహేష్ తో చిందులేస్తున్న కీర్తి మరోవైపు భోళా శంకర్ లో మెగాస్టార్ కు చెల్లిగా మారింది. ఇక, ఇప్పుడు స్టైలిష్ స్టార్ కోసం మోడరన్ పాత్రకి సిద్దమైనట్లు తెలుస్తుంది.