Keerthy Suresh : ‘సలార్’ నిర్మాతలతో కీర్తి సురేష్ కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ చూశారా?.. రిక్షా మీద ‘రఘుతాత’..

సలార్ నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ నిర్మాణంలో సుమన్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ గా కీర్తి సురేష్ కొత్త సినిమా తెరకెక్కుతుంది.

Keerthy Suresh announced her new Movie under Hombale Movie Productions and Released Title Glimpse

Keerthy Suresh : ఇటీవల ‘దసరా’ సినిమాతో హిట్ కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ, బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుంది. తాజాగా తమిళ్ లో తాను చేయబోయే నెక్స్ట్ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. సలార్ నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ నిర్మాణంలో సుమన్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ గా కీర్తి సురేష్ కొత్త సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో పాత కాలంలో రిక్షా మీద సినిమా పోస్టర్స్ ని అతికించి మైక్ లో ప్రచారం చేసినట్టు కీర్తి సురేష్ పోస్టర్ అతికించి ఉన్న రిక్షా వెళ్తున్నట్టు చూపించారు. ఈ సినిమాకి ‘రఘుతాత’ అనే వెరైటీ టైటిల్ ని ప్రకటించారు. ఇది పీరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు సమాచారం. 2024లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Also Read : RGV : అనుకున్నట్టే ఆర్జీవీ ఆ అమ్మాయిని హీరోయిన్ చేసేశాడుగా.. చెప్పినట్టే తనతో ‘శారీ’ సినిమా అనౌన్స్..

 

https://www.youtube.com/watch?v=M_xMRQktQFA