RGV : అనుకున్నట్టే ఆర్జీవీ ఆ అమ్మాయిని హీరోయిన్ చేసేశాడుగా.. చెప్పినట్టే తనతో ‘శారీ’ సినిమా అనౌన్స్..
కొన్ని రోజుల క్రితం ఒక చీర కట్టుకున్న అమ్మాయి రీల్ వీడియో పోస్ట్ చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి అని పోస్ట్ చేశాడు ఆర్జీవీ.

RGV Announced New Movie Titled as Saree with Social Media Star Aaradhya Devi Poster goes Viral
RGV Movie : రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ట్వీట్స్, పోస్టులు పెట్టి వైరల్ అవుతూ ఉంటాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక చీర కట్టుకున్న అమ్మాయి రీల్ వీడియో పోస్ట్ చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి అని పోస్ట్ చేశాడు ఆర్జీవీ. ఇంకేముంది రాత్రికి రాత్రి ఆ అమ్మాయి వైరల్ అయి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఆర్జీవీకి వెళ్లిపోయాయి. కొన్ని రోజులు ఆ అమ్మాయి వీడియోలు పోస్ట్ చేసి తనని వైరల్ చేసి, ఆ అమ్మాయితో ‘శారీ'(చీర) అనే సినిమా తీస్తాను అని ప్రకటించాడు. ఆ అమ్మాయిని అందంగా వీడియోలు తీస్తున్న కెమెరామెన్ ని సైతం పిలిపించి మాట్లాడాడు.
ఆమె మళయాళంకి చెందిన శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి) అనే ఆర్టిస్ట్ అని తెలిసి, తన సోషల్ మీడియా అకౌంట్ తెలియడంతో తెలుగు యువత అంతా ఆమెని ఫాలో కొట్టడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి కూడా ఆర్జీవీ తనని పొగిడినందుకు సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఆర్జీవీ తనతో శారీ సినిమా ప్రకటించాడు కానీ నిజంగానే తీస్తారని అనుకోలేదు. ఓ పక్క వ్యూహం సినిమా రిలీజ్ బిజీలో ఉన్న ఆర్జీవీ తాజాగా అమ్మాయి హీరోయిన్ గా ‘శారీ’ టైటిల్ తోనే సినిమా ప్రకటించాడు.
Also Read : Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ.. నవ్వించి.. ఏడిపించేసిన షారుఖ్ ఖాన్..
నేడు ఉదయం శ్రీలక్ష్మి సతీష్ సీరియస్ గా చూస్తున్న ఓ పోస్టర్ ని ‘శారీ’ అనే టైటిల్ తో రిలీజ్ చేశాడు ఆర్జీవీ. అలాగే చీరలో మరో పోస్టర్ కూడా రిలీజ్ చేసి.. ఈ అమ్మాయిని ఆర్జీవీ ట్యాలెంట్ సోర్స్ టీం కనిపెట్టి ఆర్జీవీ డెన్ నుంచి పరిచయం చేస్తున్నారు. ఆమె పేరు శ్రీలక్ష్మి సతీష్ కాగా ఆమె తల్లి ఆరాధ్యదేవిగా ప్రస్తుతం మార్చింది అని తెలిపాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయి.. అనుకున్నది చేశాడు ఆర్జీవీ, మొత్తానికి ఎక్కడో కేరళలో ఉండే అమ్మాయిని ఇక్కడికి తెప్పించాడు అని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ శారీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, లేక గతంలో అనౌన్స్ చేసి వదిలేసినా కొన్ని సినిమాల్లాగే నిలిచిపోతుందా చూడాలి. ఇక ఆర్జీవీ పరిచయం చేసిన అమ్మాయి కచ్చితంగా వైరల్ అయి ఫాలోవర్స్, ఛాన్సులు సాధించి బాగానే పాపులర్ అవుతుంది. ఆల్రెడీ ఆర్జీవీ ఈ అమ్మాయి వీడియోలు పోస్ట్ చేసి వైరల్ చేయగా ఇప్పుడు హీరోయిన్ చేసి టాలీవుడ్ లో వదిలితే మరింత పాపులర్ అవ్వడం ఖాయం.