Keerthy Suresh : దసరా సక్సెస్ తో కీర్తి సురేష్ ఎలా ఎగురుతుందో చూడండి.. నవ్వాగదు..
దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.

Keerthy Suresh enjoying Dasara Movie success video goes viral
Keerthy Suresh : నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో శ్రీరామనవమి(Sri Ramanavami) కానుకగా రిలీజయిన సినిమా దసరా(Dasara). సినిమాపై భారీ అంచనాలు ఉండగా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక రెండు రోజుల్లో 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్(Gross Collections) సాధించి నాని కెరీర్ లో ఫాస్ట్ గా 50 కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది దసరా.
దసరా సినిమా సక్సెస్ తో చిత్రయూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు అందరూ కూడా సినిమా అదిరిపోయింది అంటూ చిత్రయూనిట్ ని, ముఖ్యంగా నాని యాక్టింగ్ సూపర్ అంటూ నానిని అభినందిస్తున్నారు. దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..
కీర్తి సురేష్ దసరా సక్సెస్ పై సంతోషం వ్యక్తం చేస్తూ దసరా సెట్ లో షూటింగ్ టైంలో ఎగురుకుంటూ వెళ్లి కార్ లో కూర్చునే ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో కీర్తి వైట్ శారీలో ఎగురుకుంటూ, అరుస్తూ, సంతోషంతో వెళ్లి కార్ లో కూర్చుంటుంది. ఈ వీడియో పోస్ట్ చేసి.. దసరా సినిమాకు మీ అందరూ ఇచ్చిన సక్సెస్, ప్రేమను చూసి వెన్నెల ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ జంపింగ్ చేస్తుంది అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన వాళ్ళు నవ్వుతూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కీర్తిలో ఓ చిన్న పిల్ల దాగుందని, చిన్న పిల్ల లాగా భలే ఎగురుతుందని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కీర్తి పోస్ట్ చేసిన ఈ వీడియో కింద సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.