Nani Dasara Movie:దసరాలో వెన్నెల చిందులు.. కీర్తి సురేష్‌కి నాని బర్త్ డే గిఫ్ట్..
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా “దసరా”. 90 దశకంలో సింగరేణి బొగ్గు గనులు బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. తాజాగా సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం.

Keerthy Suresh First Look Poster from Dasara Movie
Nani Dasara Movie: కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా “దసరా”. 90 దశకంలో సింగరేణి బొగ్గు గనులు బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. తాజాగా సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం.
Nani Dasara Movie: రిలీజ్‌కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!
ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు కావడంతో హీరో నాని.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమాలోని కీర్తి పాత్రను పరిచయం చేశాడు. “వెన్నెల అనేది ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక అనుభూతి. హ్యాపీ బర్త్ డే చిత్తు చితుల బొమ్మ” అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ లో కీర్తి.. పెళ్లికూతురు గెటప్ లో చిందులు వేస్తూ కనబడుతుంది.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నేను లోకల్’ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 2023 సమ్మర్ కి రాబోతున్న ఈ సినిమాలోని మొదటి సింగిల్.. ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’ సాంగ్ విడుదలయ్యి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
Vennala is not just a name.
It’s an emotion ♥️Happy birthday to our chitthu chitthula bomma ?@KeerthyOfficial #Dasara pic.twitter.com/GHOCylIK79
— Nani (@NameisNani) October 17, 2022