Nani Dasara Movie: రిలీజ్‭కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘దసరా’ సినిమా బిజినెస్ కూడా పూర్తయినట్లు సమాచారం.

Nani Dasara Movie: రిలీజ్‭కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!

Nani Dasara Movie Pre Business Touches 100 Crores Mark

Nani Dasara Movie: నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘దసరా’ సినిమా బిజినెస్ కూడా పూర్తయినట్లు సమాచారం.

Song from Dasara : ధూమ్ ధామ్ దోస్తాన్.. పక్కా తెలంగాణ మాస్ సాంగ్ తో అదరగొట్టేసిన నాని..

ఈ సినిమా టీజర్ అండ్ సాంగ్స్ కు మంచి హైప్ రావడంతో ఓటీటీ డీల్ కూడా భారీ రేటుకు కుదిరిందని తెలుస్తోంది. ప్రముఖ OTT కంపెనీ అమెజాన్ ఈ సినిమా తెలుగు మరియు ఇతర భాషలకు చెందిన రైట్స్ మొత్తం 40 కోట్లకు సొంతం చేసుకుందట. శాటిలైట్ రైట్స్ కూడా రూ.20 కోట్లు పలికాయి అని సమాచారం. వీటితో దాదాపు రూ.60 కోట్ల వ్యాపారం జరిగింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ.40 కోట్లకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే రూ.100 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట. నాని లాంటి మిడిల్ రేంజ్ హీరో, కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా అయినా కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో.