Keerthy Suresh : నా పెళ్లిపై మీకెందుకు అంత ఆసక్తి.. పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..

ఇటీవల గత కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో అని వార్తలు వస్తున్నాయి. తాజాగా మామన్నన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో కూడా కీర్తికి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Keerthy Suresh : నా పెళ్లిపై మీకెందుకు అంత ఆసక్తి.. పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..

Keerthy Suresh gives clarity on her marriage again in Maamannan Audio Launch Event

Updated On : June 3, 2023 / 11:55 AM IST

Keerthy Suresh : కీర్తి సురేష్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కీర్తి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. తెలుగులో భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. తాజాగా కీర్తి నటించిన మామన్నన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేసిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇటీవల గత కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కీర్తి తన ఫ్రెండ్ తో తిరగగా పెళ్ళికొడుకు అతనే అని కూడా వార్తలు వైరల్ అవ్వడంతో కీర్తి దీనిపై క్లారిటీ ఇచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే చెప్తాను అని ట్వీట్ కూడా చేసింది.

Sharwanand : శర్వానంద్ సంగీత్ వేడుకలో చరణ్.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో చరణ్ సందడి..

తాజాగా మామన్నన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో కూడా కీర్తికి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పలువురు తమిళ మీడియా ప్రతినిధులు కీర్తిని పెళ్లి గురించి అడగడంతో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నా పెళ్లి పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఎందుకు పెళ్లి గురించే అడుగుతారు.మీ అందరికి నా పెళ్లిపై ఎందుకంత ఆసక్తి? నేను పెళ్లి చేసుకుంటే నేనే స్వయంగా చెప్తాను అని తెలిపింది. దీంతో మరోసారి కీర్తి ఇప్పట్లో తన పెళ్లి లేదని క్లారిటీ ఇచ్చింది.