ప్రభాస్ “ఆది పురుష్”: సీతగా కీర్తి సురేష్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం రౌత్(తానాజీ ఫేమ్) దర్శకత్వంలో మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనర్‌గా రెడీ అవుతున్న సినిమా “ఆది పురుష్”.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్ను ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నట్లు చెబుతుండగా.. సీత పాత్ర కోసం జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ విషయమై సినిమా నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కీర్తిసురేశ్ ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో మరో సినిమా చేయబోతున్నాడు.