KGF 2 టీజర్ కాదు: యశ్ బర్త్ డే స్పెషల్‌ ఇదే

KGF 2 టీజర్ కాదు: యశ్ బర్త్ డే స్పెషల్‌ ఇదే

Updated On : January 7, 2020 / 7:46 PM IST

ఒక్క సౌత్‌లోనే కాదు.. భారత సినిమా ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన సినిమా KGF. సీక్వెల్ ప్లాన్ చేసిన సినిమా యూనిట్ అంచనాలు పెరిగిపోవడంతో తొలి భాగం కంటే రెండో పార్ట్‌ కోసం ఎక్కువ కష్టపడుతుంది. కేజీఎఫ్ సినిమా అప్‌డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు యశ్ బర్త్ డే కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఆ సినిమా టీజర్ వస్తుందని ఊహించిన వారందరికీ నిరాశే మిగిలింది. 

అయితే అభిమానుల కోసం కొత్త పోస్టర్ ను విడుదల చేయనున్నారు. జనవరి 8న పుట్టిన రోజున ఉదయం 10గంటల 8నిమిషాలకు పోస్టర్ విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. హోంబల్ ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ డైరక్టన్ లో సినిమా ఈ ఏడాది విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. 

ఈ బర్త్ డే వేడుకను ఆల్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. బెంగళూరులోని నయాందహల్లీ ప్రాంతంలో ఉన్న నందీ లింక్స్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 5వేల కేజీల కేక్ తో పాటు.. 216అడుగుల ఎత్తులో కటౌట్ ఏర్పాటు చేశారు. 

ఈ వేడుకల కోసం నగరానికి పలు నగరాల నుంచి అభిమానులు తరలివస్తుండటంతో రైల్వే స్టేషన్ నుంచి 10ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి 20వేల మంది వరకూ రానున్నట్లు అంచనా. యశ్ అతని భార్య రాధిక కార్యక్రమానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.