Mouni Roy Swim Suit Pics: తెల్లటి బికినీలో పోజులిస్తూ.. ‘నా కలలు అన్నీ నాకే సొంతం’ అంటున్న కేజీఎఫ్ ఫేమ్ మౌని రాయ్
అదిరిపోయేలా అందాలు ఆరబోస్తూ.. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. .. ‘నా కలలు అన్నీ నాకే సొంతం’ అంటోంది కేజీఎఫ్ ఫేమ్ మౌని.

మౌనీ రాయ్.. నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ .. కేజీఎఫ్‌లో యశ్ సరసన ఐటెం సాంగ్‌లో నటించి మెప్పించింది. అంతకుముందే నాగిని సీరియల్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో టెలికాస్ట్ అవ్వడం వలన మౌని బాగా ఫేమస్ అయిపొయింది. అంతేగాక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం మూవీలో లేడీ విలన్ గా మెప్పించి ఆకట్టుకుంది.
ఈ బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో అదిరిపోయేలా అందాలు ఆరబోస్తూ.. అభిమానులను కనువిందు చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ ఉంటుంది.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో స్విమ్ సూట్ లో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది..
“నా కలలు అన్నీ నాకే సొంతం. అవి ఇతరులకు సంబంధించినవి కూడా అని నేను ఎన్నడూ అనుకోను. నా మనసు బాగోలేనప్పుడు నేను నా కలలనే ఆశ్రయిస్తాను.. నేను స్వేచ్ఛగా ఉన్నప్పుడు నా కలలే నాకు ఆనందాన్నిస్తాయి..”
మౌనీ రాయ్ అభిమానులు హార్ట్, ఫైర్ ఎమోజీలతో.. ‘గార్జీయస్’ అంటూ తెగ పొగిడేస్తున్నారు..
View this post on Instagram