King: గుడ్ న్యూస్.. షారుఖ్ ‘కింగ్’ రిలీజ్ డేట్ టీజర్ వచ్చేసింది.. విజువల్స్ నెక్స్ట్ లెవల్
షారుఖ్ ఖాన్ 'కింగ్(King)' మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.
Shah Rukh Khan King movie release date out now
- షారుఖ్ హీరోగా ‘కింగ్’ మూవీ
- రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- 2026 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు
King: బాలీవడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్(King)’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. పఠాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత షారుఖ్- సిద్దార్థ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో కింగ్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఇండియన్ సినీ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ‘కింగ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
Akira Nandan: హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు అకీరా.. కారణం ఏంటంటే?
అంతేకాదు స్పెషల్ టీజర్ కూడా విడుదల చేశారు. 2026 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న కింగ్ సినిమా విడుదల అవుతుంది అంటూ ప్రకటించారు. ఇక టీజర్ లో షారుఖ్ లుక్స్, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది అనే చెప్పాలి. మరి ఈ సినిమా విడుదల తరువాత పఠాన్ సినిమాను రికార్డులు బ్రేక్ అవుతాయా అనేది చూడాలి.
