Meter Movie: సినిమాను తీయడంకంటే అదే పెద్ద సవాలుగా మారిందంటున్న కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘మీటర్’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కిరణ్ అబ్బవరం మీడియాతో పంచుకున్నాడు.

Meter Movie: సినిమాను తీయడంకంటే అదే పెద్ద సవాలుగా మారిందంటున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Comments On Meter Movie Promotions

Updated On : April 5, 2023 / 9:55 PM IST

Meter Movie: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్ర ‘మీటర్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రమేష్ కడూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Meter Trailer : కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా చేస్తోంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ని తాజాగా నిర్వహించిన చిత్ర యూనిట్, సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దర్శకుడు రమేష్ కడూరిపై నమ్మకంతోనే ఈ సినిమాను పూర్తి చేశామని.. అయితే సినిమాను తీయడంలో తమకు పెద్దగా కష్టం అనిపించలేదు కానీ.. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లడం తమకు ఓ పెద్ద సవాలుగా మారిందని.. అయినా తాము ఆ విషయంలో విజయం సాధించామని హీరో అన్నాడు.

Meter Trailer: యాక్షన్ డోస్ పెంచేసిన కిరణ్ అబ్బవరం.. మీటర్ సెట్ అయినట్టే!

థియేటర్‌ నుంచి వెళ్లే సమయంలో సినిమా అప్పుడే అయిపోయిందా అని ప్రేక్షకులు ఫీల్ అవుతారని కిరణ్ అబ్బవరం ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ అతుల్య రవి హీరోయిన్‌గా నటిస్తోండగా సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. మరి ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీటర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.