Kiran Abbavaram : మైత్రీ మూవీస్‌లో కిరణ్ అబ్బవరం క్రేజీ మూవీ..

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం హీరోగా మైత్రీ మూవీస్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

Kiran Abbavaram : మైత్రీ మూవీస్‌లో కిరణ్ అబ్బవరం క్రేజీ మూవీ..

Clap Entertainment

Updated On : November 29, 2021 / 4:01 PM IST

Kiran Abbavaram: ఫస్ట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుని.. ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మరో కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది.

 

Clap Entertainment

స్టార్ హీరోలతో.. క్రేజీ కాంబినేషన్స్‌తో ప్రెస్టీజియస్ సినిమాలతో పాటు కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ.. కొత్తవారికి అవకాశాలిస్తూ విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ‘మత్తువదలరా’ సినిమాను నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. బాబీ, గోపిచంద్ మలినేని వంటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి అనుభవం సంపాదించిన రమేష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Bobby

ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ నివ్వగా.. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్ చేశారు. గోపిచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి (చెర్రీ)లు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ రెండో వారం నుండి స్టార్ట్ కాబోతోంది.

Koratala

రమా రాజమౌళి, శ్రీవల్లి, కాల భైరవ, శ్రీసింహా, సాయి కొర్రపాటి, గుణ్ణం గంగరాజు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్.సి.దిలీప్, ప్రొడక్షన్ డిజైనర్: జేవీ, సంభాషణలు: రమేష్ కాదూరి, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల. కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రమేష్ కాదూరి.

Clap Entertainment