Vinaro Bhagyam Vishnu Katha: “వినరో భాగ్యం విష్ణు కథ”.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టీజర్ అదుర్స్..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు విడుదల చేస్తూ అలరిస్తున్నాడు. కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "వినరో భాగ్యం విష్ణు కథ". ఇక ఈ సినిమా టీజర్ ని మూవీ టీం శనివారం విడుదల చేసింది.

Vinaro Bhagyam Vishnu Katha: “వినరో భాగ్యం విష్ణు కథ”.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టీజర్ అదుర్స్..

Kiran Abbavaram New Movie Vinaro Bhagyam Vishnu Katha Teaser Adurs.

Updated On : October 30, 2022 / 1:38 PM IST

Vinaro Bhagyam Vishnu Katha: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు విడుదల చేస్తూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలను విడుదల చేసిన ఈ యువహీరో, మరో సినిమాని లైన్ లో పెట్టేసాడు. ఇన్నాళ్లు లవ్ అండ్ ఫామిలీ ఎంటెర్టైనెర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్, ఈసారి మాస్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద నిలవబోతున్నాడు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ రిలీజ్ వాయిదా.. కారణం ఏమిటో?

కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “వినరో భాగ్యం విష్ణు కథ”. ఇక ఈ సినిమా టీజర్ ని మూవీ టీం శనివారం విడుదల చేసింది. “ఏడు వింతలూ గురించి మాకు పెద్దగా తెలియదుగాని, మా జీవితాలని ఏడుకొండలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి” అని మొదలైన టీజర్ మంచి ఇంట్రస్టింగ్ గా సాగింది. టీజర్ చివరిలో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో కొత్తగా కనబడబోతున్నాడు అంటూ ఒక డైలాగ్ తో చెప్పుకొచ్చారు.

టీజర్ బట్టి చూస్తే కిరణ్ ఈ సినిమాలో ప్రెస్ రెపోర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక టీజర్ ఎండ్ కార్డు పోస్టర్ అయితే సినిమాపై అంచనాలని పెంచేలా ఉంది. గీతా ఆర్ట్స్-2 పతాకంపై వస్తున్నా ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బుర దర్శకత్వం వహిస్తున్నాడు. కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నట్లు టీజర్ తో ప్రకటించారు.