Kiran Abbavaram : ‘క’ అంటున్న కిరణ్ అబ్బవరం.. సింగిల్ లెటర్‌తో 20 కోట్ల పాన్ ఇండియా సినిమా..
తాజాగా కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.

Kiran Abbavaram Next Movie Titled as KA movie with 20 Crores huge Budget as Pan India Movie
Kiran Abbavaram : రాజావారు రాణిగారు, SR కల్యాణమండపం, సమ్మతమే.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన కిరణ్ అబ్బవరం త్వరలో భారీ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరు డైరెక్టర్స్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమాకు ‘క’ అని సింగిల్ లెటర్ తో ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాని ఏకంగా 20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కిరణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ఇది రానుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
Also Read : Polimera 3 : పొలిమేర 3 కూడా వచ్చేస్తుంది.. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా ఫినిష్..
ఆల్రెడీ ఈ ‘క’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇలా సింగిల్ లెటర్ తో కిరణ్ అబ్బవరం సినిమా అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ భారీ పీరియాడిక్, భారీ బడ్జెట్ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలా మెప్పిస్తాడో చూడాలి.
View this post on Instagram