Polimera 3 : పొలిమేర 3 కూడా వచ్చేస్తుంది.. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా ఫినిష్..
గతంలోనే పొలిమేర 2కి కూడా సీక్వెల్ ఉండొచ్చని తెలిపారు. తాజాగా అధికారికంగా పొలిమేర 3 అనౌన్స్ చేశారు.

Satyam Rajesh Polimera one more Sequel Polimera 3 Announced Officially
Polimera 3 : సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా ఓటీటీలో రిలీజయి పెద్ద హిట్ అయింది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా మా ఊరి పొలిమేర 2 కూడా గత సంవత్సరం థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. 3 కోట్లతో పొలిమేర 2 తీస్తే ఏకంగా 15 కోట్లు వసూలు చేసింది. చిన్న సినిమాగా వచ్చినా అదిరిపోయే ట్విస్ట్‌లతో, థ్రిల్లింగ్ అంశాలతో ఆడియన్స్ ని మెప్పించింది.
Also Read : Anasuya – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. చిన్న పాత్ర చేశాను అంటూ..
గతంలోనే పొలిమేర 2కి కూడా సీక్వెల్ ఉండొచ్చని తెలిపారు. తాజాగా అధికారికంగా పొలిమేర 3 అనౌన్స్ చేశారు. వంశీ నందిపాటి నిర్మాణంలో అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలోనే పొలిమేర 3 తెరకెక్కనుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్లతో పాటు గత సినిమాలో ఉన్న నటీనటులే పార్ట్ 3లో కూడా ఉండనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
A new phase of haunting narrative begins…
We are excited to announce #Polimera3, part of #Polimera franchise!❤️?
Script Work Completed & Pre-Production Begins!?#Polimera3Loading – The Breathtaking Horror Franchise Moves to the Next Level?
A @DrAnilViswanath Film
Produced… pic.twitter.com/B1EOuA2Eqn— Vamsi Nandipati (@connect2vamsi) July 10, 2024
పొలిమేర 3 సినిమాని అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అని పొలిమేర సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిమేర ఫ్రాంచైజ్ లో మరిన్ని పార్టులు కూడా ఉంటాయేమో చూడాలి.