Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లియో సినిమాలో ఉన్నాడా? వికీపీడియా ఇన్ఫర్మేషన్ నిజమేనా?

లియో సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. పలు తమిళ హీరోలు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఇవన్నీ అబ్బద్దమే అని తేలింది.

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లియో సినిమాలో ఉన్నాడా? వికీపీడియా ఇన్ఫర్మేషన్ నిజమేనా?

Kiran Abbavaram played a guest role in Leo Movie Wikipedia Misleading Information

Updated On : October 27, 2023 / 11:44 AM IST

Kiran Abbavaram : పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత SR కల్యాణమండపం సినిమాతో మంచి విజయం సాధించాడు. అప్పట్నుంచి సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు కిరణ్. ఇటీవలే రూల్స్ రంజన్ సినిమాతో పలకరించగా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.

అయితే ఇటీవల దసరాకు వచ్చినా విజయ్(Vijay) లియో(Leo) సినిమాలో కిరణ్ అబ్బవరం ఉన్నాడు అనే వార్త వైరల్ గా మారింది. లోకేష్ కనగరాజ్(lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో సినిమా రిలీజయి మంచి విజయం సాధించింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా ఉందని చెప్పడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. ఇప్పటికే లియో సినిమా 461 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసినట్టు సమాచారం.

అయితే లియో సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. పలు తమిళ హీరోలు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఇవన్నీ అబ్బద్దమే అని తేలింది. లియో సినిమాలో ఎవ్వరూ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వలేదు. అయితే లియో సినిమాలో కిరణ్ అబ్బవరం గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు అని ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా చూసిన వాళ్లకి లియోలో ఎక్కడా కిరణ్ అబ్బవరం కనపడలేదు.

Also Read : Tillu Square : ఎట్టకేలకు డీజే టిల్లు సీక్వెల్ రిలీజ్ డేట్ ఫైనల్.. టిల్లు స్క్వేర్ ఎప్పుడొస్తుందా తెలుసా?

కానీ వికీపీడియా కిరణ్ అబ్బవరం పేజీలో మాత్రం లియో సినిమాలో అర్జున్ కళ్యాణ్ అనే పాత్ర చేసినట్టు, గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినట్టు చూపిస్తుంది. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం కిరణ్ కి తెలుసా? లేదా కిరణ్ ఫ్యాన్స్ కానీ, కిరణ్ యాంటీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కావాలని వికీపీడియాలో ఇలా పోస్ట్ చేశారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

 Kiran Abbavaram played a guest role in Leo Movie Wikipedia Misleading Information