Kiran Abbavaram : స్టార్ హీరోల్లా కిరణ్ అబ్బవరం కూడా.. సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారా?
స్టార్ హీరోల మాదిరి కిరణ్ అబ్బవరం కూడా సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారా..? ఇటీవల ఎంట్రీ ఇచ్చి కిరణ్ కూడా..

Kiran Abbavaram taking profits in movie collections as like star heroes
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు దూసుకు పోతున్నారు. ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా వీటిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మాత్రం పర్వాలేదని అనిపించుకుంది. కాగా రీసెంట్ గా ఈ హీరో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అషు రెడ్డిని హోస్టుగా పెట్టి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన కొత్త టాక్ షో ‘దావత్’.
ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కి యువ హీరో కిరణ్ అబ్బవరంని గెస్ట్ గా తీసుకువచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కిరణ్ కి సంబంధించిన అనేక విషయాలను ఆడియన్స్ కి తెలియజేశారు అషు రెడ్డి. కాగా కిరణ్ అబ్బవరం తన నటించిన సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సాధారణంగా బడా స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా చేస్తుంటారు. అలాంటిది ఇటీవల ఎంట్రీ ఇచ్చి కిరణ్ కూడా ఇదే పని చేస్తున్నారా? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also read : Trisha : త్రిష మన్సూర్ వివాదం పై జాతీయ మహిళా కమిషన్ ఫైర్.. డీజీపీకి ఫిర్యాదు..!
అయితే కిరణ్ ఇలా చేయడానికి మంచి ఆలోచనే ఉందట. తన లాభం తాను చూసుకొని సినిమా మొదటిలోనే రెమ్యూనరేషన్ తీసుకోని హీరో పక్కకి తప్పుకుంటే.. సినిమా ఆడకపోతే నష్టబోయేది నిర్మాత. అలా నిర్మాతని కష్టంలోకి తోయడం ఇష్టం లేక.. లాభాలు వచ్చిన తరువాత రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతకు నష్టం వస్తే.. ఎటువంటి డబ్బుని డిమాండ్ చేయరట.
తాను నటించిన దాదాపు అన్ని సినిమాలకు ఇదే పద్ధతి ఫాలో అయ్యినట్లు, కేవలం ఒకటి రెండు సినిమాలకు మాత్రమే ముందే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న హీరో అయినా పెద్దగా ఆలోచించారంటూ పొగడ్తలతో ముంచేతున్నారు. కాగా ప్రస్తుతం లైనప్ లో మూడు సినిమాలు ఉన్నట్లు కిరణ్ తెలియజేశారు. వాటి గురించిన అప్డేట్స్ తెలియాల్సి ఉంది.