Kiran Abbavaram Visits Tirumala Venkateswara Swamy Temple
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘క’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన క అక్టోబర్ 31న దీపావళికి గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.
కిరణ్ అబ్బవరం నేడు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. దీంతో తిరుమలలో కిరణ్ అబ్బవరం ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దర్శనానంతరం బయటకి వచ్చాక పలువురు భక్తులు కిరణ్ ఫొటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు.