Kiran Abbavaram : ప్రమోషన్స్ కోసం.. సైకిల్ తొక్కుతూ.. ఇద్దరు హీరోయిన్స్‌ని సైకిల్ ఎక్కించుకున్న కిరణ్ అబ్బవరం..

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

Kiran Abbavaram : ప్రమోషన్స్ కోసం.. సైకిల్ తొక్కుతూ.. ఇద్దరు హీరోయిన్స్‌ని సైకిల్ ఎక్కించుకున్న కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram Riding a bicycle with Heroines for KA Movie Promotions Photos goes Viral

Updated On : October 27, 2024 / 5:30 PM IST

Kiran Abbavaram : ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా జనాల్లోకి వెళ్ళడానికి హీరో, హీరోయిన్స్, అందులో నటించిన నటీనటులు కొత్త రకాల ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం కూడా సరికొత్త ప్రమోషన్ చేసాడు. కిరణ్ అబ్బవరం ‘క’ అనే సినిమాతో దీపావళి కానుకగా అక్టోబర్ 31 రానున్నాడు. పీరియాడిక్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్.. కొత్త పోస్టర్ రిలీజ్.. యాక్షన్ సీన్ ఫొటోతో..

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ నిర్వహించగా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా సరదాగా కిరణ్ అబ్బవరం సైకిల్ తొక్కాడు. అంతే కాకుండా సైకిల్ మీద ఇద్దరు హీరోయిన్స్ ని ఎక్కించుకొని ఫోటోలకు పోజులిచ్చాడు కిరణ్.

Kiran Abbavaram Riding a bicycle with Heroines for KA Movie Promotions Photos goes Viral

క సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్ జాబ్ చేస్తాడు. సినిమాలో జాబ్ పరంగా సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. దీంతో ప్రమోషన్స్ లో ఇలా సైకిల్ తొక్కడం, ఇద్దరు హీరోయిన్స్ ని ఎక్కించుకొని పోజులు ఇవ్వడంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.