Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్.. కొత్త పోస్టర్ రిలీజ్.. యాక్షన్ సీన్ ఫొటోతో..
తాజాగా నేడు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

Ram Charan Game Changer Movie New Poster Released
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మూడేళ్ళుగా సాగినా ఇటీవల గత కొన్ని రోజుల నుంచి మాత్రం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేసారు. ఈ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీపావళికి గేమ్ ఛేంజర్ టీజర్ ఉండొచ్చని ఇటీవల తమన్, దిల్ రాజు అన్నారు.
తాజాగా నేడు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చరణ్ కుర్చీలో కూర్చుంటే ఎదురుగా చాలా మంది రౌడీలు వస్తున్నట్టు ఉంది. దీంతో ఇది పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి తీసుకున్న ఫోటో అని తెలుస్తుంది.
ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేసి గేమ్ ఛేంజర్ టీజర్ దీపావళికే రాబోతున్నట్టు ఫైర్ క్రాకర్స్ సింబల్స్ వేసి తెలిపారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారగా ఫ్యాన్స్ దీపావళికి రాబోతున్న గేమ్ ఛేంజర్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ రిలీజ్ చేసిన పోస్టర్ తో మరోసారి గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికే రిలీజ్ కాబోతుందని క్లారిటీ ఇచ్చారు.
Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥
The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/b5bhC0BezZ— Game Changer (@GameChangerOffl) October 27, 2024