KL Rahul-Athia Shetty : బాలీవుడ్ స్టార్ యాక్టర్ కూతురితో ఇండియన్ క్రికెటర్ పెళ్లి.. మొదలైన పెళ్లిపనులు..

జనవరి 23న రాహుల్-అతియా వివాహం జరగబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ముంబైలో రాహుల్, అతియా.. ఇద్దరి ఇళ్ళని అందంగా..........

KL Rahul-Athia Shetty : బాలీవుడ్ స్టార్ యాక్టర్ కూతురితో ఇండియన్ క్రికెటర్ పెళ్లి.. మొదలైన పెళ్లిపనులు..

KL Rahul and Athia Shetty marriage works started in Mumbai

Updated On : January 19, 2023 / 10:03 AM IST

KL Rahul-Athia Shetty :  బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. సునీల్ శెట్టి ప్రస్తుతం సౌత్, హిందీ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీబిజీగా ఉన్నారు. ఇక సునీల్ శెట్టి కూతురిగా సినీ పరిశ్రమలోకి అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసిన అతియా ప్రస్తుతం ఇంకా ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని కూడా బాగానే సంపాదించుకుంది అతియా.

గత కొంతకాలంగా అతియా టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ తో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై అధికారికంగా వీరిద్దరూ స్పందించకపోయినా ముంబైలో చెట్టాపట్టాలేసుకొని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. ఇటీవల అతియా తండ్రి సునీల్ శెట్టి దీనిపై క్లారిటీ ఇస్తూ త్వరలోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని కూడా ప్రకటించారు. దీంతో మరో క్రికెట్-బాలీవుడ్ జంట రెడీ అయింది.

Prabhas : ఈ సంవత్సరం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా??

అయితే ఇప్పటికి కూడా కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టి పెళ్లిపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. పెళ్లి కోసం కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం టీం ఇండియా ఆడుతున్న న్యూజిలాండ్ సిరీస్ కి కూడా దూరమయ్యాడు. జనవరి 23న రాహుల్-అతియా వివాహం జరగబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ముంబైలో రాహుల్, అతియా.. ఇద్దరి ఇళ్ళని అందంగా డెకరేషన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నట్టు సమాచారం. వీరి వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు, ఇండియన్ క్రికెట్ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by @varindertchawla