Kollagottinadhiro Promo from Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీల్లో హరిహర వీరమల్లు ఒకటి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మార్చి 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని ఒక్కొ పాటను విడుదల చేస్తోంది.
ఇప్పటికే పవన్ పాడిన పాట మాటవినాలిని విడుదల చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట కొల్లగొట్టినాదిరో సాంగ్ ప్రొమోను విడుదల చేసింది. ఇందులో పవన్ కర్రపట్టుకుని నడుచుకుంటూ వస్తుండగా.. కొర కొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో అంటూ అనసూయ, పూజితా పొన్నాడలు పవన్ ధీరత్వాన్ని, అందాన్ని వర్ణిస్తున్నారు.
Emoji : తెలుగులోకి వస్తున్న తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్.. ఎందులోనో తెలుసా?
ఇక పూర్తి పాట ఫిబ్రవరి 24న మధ్యాహ్నాం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ పాట ప్రొమో వైరల్‌గా మారింది.
Marco : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్కో’
క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.