Emoji : తెలుగులోకి వ‌స్తున్న త‌మిళ రొమాంటిక్ వెబ్ సిరీస్‌.. ఎందులోనో తెలుసా?

త‌మిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఎమోజీ అతి త్వ‌ర‌లోనే తెలుగులో స్ట్రీమింగ్‌కు కానుంది.

Emoji : తెలుగులోకి వ‌స్తున్న త‌మిళ రొమాంటిక్ వెబ్ సిరీస్‌.. ఎందులోనో తెలుసా?

Emoji Streaming from february 28th on aha ott

Updated On : February 21, 2025 / 1:46 PM IST

మ‌హ‌త్ రాఘ‌వేంద్ర‌, దేవిక‌, మాన‌స చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వెబ్‌సిరీస్ ఎమోజీ. సెన్ రంగ‌సామీ ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ త‌మిళ రొమాంటిక్ సిరీస్ అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ వెబ్‌సిరీస్‌ను అదే పేరుతో స్ట్రీమింగ్ చేయ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఆహా వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

త‌మిళంలో విడుద‌లైన రెండు సంవ‌త్స‌రాల తెలుగులో వ‌స్తుంది. ఓ జంట మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహానికి ఎలా దారి తీసింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చి మ‌రో అమ్మాయితో ఆ యువ‌కుడు ఎందుకు జీవించాల‌ని అనుకున్నాడు?

Marco : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్కో’

ఆ త‌రువాత విడాకులు తీసుకున్న అమ్మామే మ‌ళ్లీ అత‌డి జీవితంలోకి ఎలా వ‌చ్చింది? అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. త‌మిళంలో ఈ వెబ్‌సిరీస్ మంచి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంది.

Akira Nandhan : త్రివిక్ర‌మ్ కొడుకు ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న‌యుడి ఎంట్రీ..!

కాగా.. ఈ వెబ్‌సిరీస్ న‌టించిన మాన‌స చౌద‌రి తెలుగు అమ్మాయి కావ‌డం విశేషం. బ‌బుల్‌గ‌మ్ చిత్రంతో అమ్మ‌డు టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సుమ క‌న‌కాల కొడుకు రోష‌న్ ఈ చిత్రంలో హీరోగా న‌టించాడు. దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌క్కీ భాస్క‌ర్ మూవీలోనూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది మాన‌స‌.