Marco : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్కో’
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Marco Telugu ahaCut Trailer
ఉన్ని ముకుందన్ హీరోగా దర్శకుడు హనీఫ్ తెరకెక్కించిన చిత్రం మార్కో. గతేడాది డిసెంబర్ 20న ఈ మలయాళ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
Akira Nandhan : త్రివిక్రమ్ కొడుకు దర్శకత్వంలో పవన్ తనయుడి ఎంట్రీ..!
ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ రోజు రానే వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
క్రమంలో ఓ కొత్త ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తను ఎంతో ప్రేమించే సోదరుడు విక్టర్ ను చంపిన వారిపై మార్కో పగ తీర్చుకునే తీరు హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులతో ఇంప్రెస్ చేసింది.
Raa Raja : ‘రా రాజా’ రిలీజ్ డేట్ అనౌన్స్.. నటీనటుల ముఖాలు చూపించకుండా సరికొత్త హారర్ సినిమా..
క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.