Indraja Shankar : పెళ్లిపీటలు ఎక్కిన ‘బిగిల్’ పోచమ్మ.. డైరెక్టర్‌తో వివాహం..
పెళ్లిపీటలు ఎక్కిన 'బిగిల్' మూవీ పోచమ్మ. తన స్నేహితుడైన డైరెక్టర్ కార్తీక్‌తో..

Kollywood star comedian Robo Shankar daughter Indraja marriage photos
Indraja Shankar : కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి ‘ఇంద్రజ’. స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాలో పోచమ్మ పాత్రలో నటించి ఇంద్రజ ఆడియన్స్ కి పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగులో విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసిన ఇంద్రజ.. మూడో సినిమాగా శివకార్తికేయన్ ‘వీరుమాన్’లో నటించారు.
మళ్ళీ ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. కానీ బుల్లితెరపై మాత్రం పలు షోలతో సందడి చేస్తూ వచ్చారు. తమిళంలో ప్రసారమయ్యే ‘సర్వైవర్’ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా కనిపించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. కాగా ఈ నటి ఇప్పుడు పెళ్లి జీవితాన్ని మొదలుపెడుతూ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు. తన స్నేహితుడైన డైరెక్టర్ కార్తీక్‌ని ఇంద్రజ పెళ్లి చేసుకున్నారు.
Also read : Om Bheem Bush Collections : ‘ఓం భీమ్ బుష్’ మంత్రం బాగా పనిచేస్తుంది.. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ..
ఈ ఏడాది ఫిబ్రవరి 2న వీరిద్దరి వివాహం జరిగింది. ఇక ఈ ఆదివారం (మార్చి 24) ఏడడుగులు వేసి పెళ్లి లైఫ్ ని స్టార్ట్ చేశారు. చెన్నైలో ఘనంగా జరిగిన ఈ పెళ్ళికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజెన్స్ కొత్తజంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram