Kota Srinivasa Rao Job Before he Entering into Movies
Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ప్రస్తుతం వయోభారంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల సినిమాలతో తెలుగు, తమిళ్ తో పాటు మరిన్ని భాషల్లో ప్రేక్షకులని మెప్పించారు. కమెడియన్ గా, విలన్ గా, తండ్రి పాత్రల్లో.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోట శ్రీనివాసరావు సక్సెస్ ఫుల్ కెరీర్ ని చూసారు. పద్మశ్రీతో సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
అయితే కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు ఏం ఉద్యోగం చేసేవారో తెలుసా? కోట శ్రీనివాసరావు తండ్రి డాక్టర్. విజయవాడ దగ్గర్లోని కంకిపాడులో ఉండేవారు. కోట శ్రీనివాసరావుని కూడా డాక్టర్ ని చేయాలనుకున్నారు. కానీ ఈయనకు నాటకాలు, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండటంతో అప్పట్లో నాటకాల వైపు తిరిగేవారు. దీంతో డిగ్రీ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు, సినిమాల్లో ఛాన్సులు అంటూ తిరిగేవారు.
Also Read : Nabha Natesh : యాక్సిడెంట్ తర్వాత ‘స్వయంభు’ కోసం మారిన నభా నటేష్.. నభా వీడియో రిలీజ్..
సినిమాల్లో ఛాన్సులు పెరగడంతో మురళీమోహన్ ని సలహా అడగ్గా.. సినిమాల్లోకి వచ్చేయ్ కానీ వచ్చే రెమ్యునరేషన్ మొత్తం ఖర్చు పెట్టకుండా సగం దాచుకో, ఒకవేళ నీకు అవకాశాలు రాకపోతే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అని చెప్పడంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చేసారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు చివరగా 2023 కన్నడ సినిమా కబ్జాలో కనపడ్డారు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నారు.