Kotha Malupu: సింగర్ సునీత కొడుకు ఆకాష్ కొత్త సినిమా.. పండుగ సందర్బంగా ‘కొత్త మలుపు’ ఫస్ట్ లుక్ విడుదల
ఆకాష్- భైరవి జంటగా వస్తున్న 'కొత్త మలుపు(Kotha Malupu)' మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
Kotha Malupu movie first look released.
- ఆకాష్- భైరవి జంటగా ‘కొత్త మలుపు’
- సంక్రాంతి సందర్బంగా ఫస్ట్ లుక్ విడుదల
- త్వరలోనే థియేటర్స్ లోకి రానున్న సినిమా
Kotha Malupu: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘కొత్త మలుపు’. భైరవి అర్థ్యా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కిస్తున్నాడు. తధాస్తు క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ‘కొత్త మలుపు(Kotha Malupu)’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Shambhala OTT: ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ ‘శంబాల’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఈ సందర్బంగా దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ..’రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాము. ఆకాష్భై- రవి జోడీ చాలా బాగా కుదిరింది. సంక్రాంతి పండుగ కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. త్వరలోనే సినిమా కూడా విడుదల అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.
