Telugu Upcoming Film: జతకట్టిన కోటి కుమారుడు.. వాణీ విశ్వనాథ్ కుమార్తె!

సినిమా పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఈ మధ్య కాలంలో చాలా సాధారణ విషయంగా మారింది. అలనాటి నటీనటులే కాదు.. తెరవెనుక సాంకేతిక నిపుణుల వారసులు కూడా వెండితెర మీద ఎంట్రీ ఇవ్వడమే ఇప్పుడు నయా..

Telugu Upcoming Film: జతకట్టిన కోటి కుమారుడు.. వాణీ విశ్వనాథ్ కుమార్తె!

Telugu Upcoming Film

Updated On : September 23, 2021 / 10:49 AM IST

Telugu Upcoming Film: సినిమా పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఈ మధ్య కాలంలో చాలా సాధారణ విషయంగా మారింది. అలనాటి నటీనటులే కాదు.. తెరవెనుక సాంకేతిక నిపుణుల వారసులు కూడా వెండితెర మీద ఎంట్రీ ఇవ్వడమే ఇప్పుడు నయా ట్రెండ్ అన్నట్లుగా మారిపోయింది. ఒకప్పటి తెలుగు గ్లామర్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ గుర్తుందా.. ఈ మధ్య సినిమాలకు దూరమైన వాణీ రాజకీయ సమావేశాలు, ప్రెస్ మీట్లలో కనిపిస్తుంది. కాగా వాణీ విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయం అవుతోంది.

Jr NTR: తాత సెంటిమెంట్.. లంబోర్ఘిని కోసం రూ.17 లక్షల నెంబర్!

మరోవైపు సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూరు కూడా ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతుండగా ఇదే సినిమాలో కోటి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ నిర్మాతగా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రొడక్షన్ నెంబర్ 1’సినిమా షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తికాగా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్ లో ప్రారంభం అయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Naga Chaitanya: విజయ్ స్థానంలో చైతూ.. మజిలీ కాంబినేషన్ రిపీట్ చేస్తారా?

సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోస్తిస్తున్న ఈ సినిమాలో యువజంట వర్ష విశ్వనాథ్, రాజీవ్ సాలూరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన యూనిట్ చాలాకాలం తర్వాత మణిశర్మ మార్క్ మెలోడీస్ ఈ సినిమా నుండి రానున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇద్దరు సెలబ్రిటీల వారసుల ఎంట్రీగా ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ అట్రాక్షన్ గా మారిపోగా మరేదైనా అదనపు హంగులు విడుదలైతే ఈ సినిమా భారీ హైప్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.