‘పులిహోర కలిపెనులే’ – టీజర్ అంతా పులిహోరే..

ఆసక్తికరంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని తదితరులు నటిస్తున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్..

  • Published By: sekhar ,Published On : February 15, 2020 / 05:58 AM IST
‘పులిహోర కలిపెనులే’ – టీజర్ అంతా పులిహోరే..

Updated On : February 15, 2020 / 5:58 AM IST

ఆసక్తికరంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని తదితరులు నటిస్తున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్..

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ‘క్షణం’తో డైరెక్టర్‌గా పరిచయమై సంచలనం సృష్టించిన రవికాంత్ పేరెపు దర్శకుడు.

వేలంటైన్స్ డే సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ కృష్ణ పేరుతో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఒక సమకాలీన అంశంతో ఈ టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ‘క్షణం’తో పోలిస్తే తన రెండో సినిమాను ఒక డిఫరెంట్ స్టోరీతో రవికాంత్ రూపొందిస్తున్నారని అర్థమవుతోంది.

 

Venkatesh

 

సరికొత్త కథనంతో మ్యాజిక్ చెయ్యడం ఆయన బలం. రాంగ్ టైమ్ రిలేషన్ షిప్స్‌తో సమస్యల్లో చిక్కుకొనే యువకుడిగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో అతను సరసాల్లో మునిగితేలుతున్నాడు. హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటిస్తున్నారు.

సబ్జెక్టుకు తగ్గ మ్యూజిక్‌ను శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ తెలిపేవిధంగా ‘పులిహోర కలిపెనులే’ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నవ్విస్తుంది. ఈ ‘పులిహోర’ ట్రాక్‌ను హేమచంద్ర రాసి, పాడడం విశేషం. సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రవికాంత్ రాయడం గమనార్హం. తర్వలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మే 1న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ప్రేక్షకులముందుకు రానుంది.

 

 

Krishna And His Leela Official Teaser

 

సాంకేతిక బృందం – 
రచన : రవికాంత్, సిద్ధు
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
‘పులిహోర’ ట్రాక్ రచన, గానం : హేమచంద్ర
సినిమాటోగ్రఫీ : షానీల్ డియో, సాయిప్రకాష్ యు.
ప్రొడక్షన్ డిజైన్ : రవి ఆంథోని
దర్శకత్వం : రవికాంత్ పేరెపు
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్.

Click Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు