Prabhas – Krishna Vamsi : ప్రభాస్‌ని సరిగ్గా వాడుకోవట్లేదు.. కృష్ణవంశీ వ్యాఖ్యలు.. ప్రభాస్‌తో కృష్ణవంశీ సినిమా..? ‘చక్రం’ టైంలో కథ..
గతంలో ప్రభాస్ తో కృష్ణవంశీ చక్రం అనే సినిమా తీశారు.

Krishnavamsi Planning a Movie With Prabhas Interesting Comments
Prabhas – Krishna Vamsi : ప్రభాస్ ప్రస్తుతం పాన ఇండియా స్టార్ గా భారీ సినిమాలు చేస్తున్నాడు. సింపుల్ లవ్ స్టోరిలకు ప్రభాస్ దూరమయ్యాడనే చెప్పొచ్చు. గతంలో ఎన్ని క్లాస్ సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు ఒప్పుకునేవి అన్ని కూడా యాక్షన్ సినిమాలే. అయితే తాజాగా కృష్ణవంశీ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
గతంలో ప్రభాస్ తో కృష్ణవంశీ చక్రం అనే సినిమా తీశారు. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది. ప్రభాస్ నటనలోని మరో కొత్త కోణాన్ని కూడా ఈ సినిమా బయటపెట్టింది. తాజాగా ఖడ్గం రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ప్రభాస్ గురించి మాట్లాడాడు.
కృష్ణవంశీ మాట్లాడుతూ.. ప్రభాస్ మంచి పర్ఫార్మర్. అతన్ని టాలీవుడ్ సరిగ్గా వాడుకోవట్లేదు. ప్రభాస్ ని యాక్షన్ సినిమాలకు, ఫైట్స్ కే పరిమితం చేస్తున్నారు. నేను చక్రంతో పాటు యాక్షన్ సినిమా కథ కూడా చెప్పాను. అప్పుడు ప్రభాస్ అందరూ యాక్షన్ కథలే తెస్తున్నారు నేను చక్రం చేస్తాను అని చెప్పాడు. 20 ఏళ్ళ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పుడు అందరూ ప్రభాస్ తో యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. గతంలో ప్రభాస్ కి నేను చెప్పిన యాక్షన్ కథతో ఇప్పుడు సినిమా తీయొచ్చు. కానీ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. నేను వెళ్లి ఆ సినిమాలు ఆపేసి నా సినిమా చేయండి అని అడగలేను. అవకాశం వస్తే కుదిరితే చేస్తాను అని తెలిపారు. మరి కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా భవిష్యత్తులో ఉంటుందేమో చూడాలి.