Krishnudu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదమూడవ కంటెస్టెంట్.. కృష్ణుడు వచ్చేసాడు..
పదమూడవ కంటెస్టెంట్ గా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. (Krishnudu)
Krishnudu
Krishnudu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్, ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది.
తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ గా సృష్టి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహాదేవుని చరణ్ తేజ పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. పదమూడవ కంటెస్టెంట్ గా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Mahadevuni Charanteja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పన్నెండవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష చరణ్..
కృష్ణుడు సినిమాల మీద ఇష్టంతో సినీ పరిశ్రమకు వచ్చాడు. చాలా ట్రై చేసాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. కానీ యాక్సిడెంట్ అవ్వడంతో లావు అయ్యాడు. అయినా ఛాన్సుల కోసం ట్రై చేసాడు. కృష్ణుడు హ్యాపీ డేస్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలతో హీరోగా కూడా సక్సెస్ కొట్టాడు. కొన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి 2019 నుంచి సినిమాలకు దూరమయ్యాడు కృష్ణుడు. మళ్ళీ 2024 నుంచి అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల లగ్గం, గేమ్ ఛేంజర్, షణ్ముఖ, బ్యాడ్ బాయ్ కార్తీక్.. లాంటి పలు సినిమాల్లో నటించాడు. గతంలో కృష్ణుడు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
