Krishnudu Padyam Release
Krishna Ghattam : వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకం పై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణంతో సురేష్ పళ్ళ స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కృష్ణ ఘట్టం'(Krishna Ghattam). ఈ చిత్రానికి మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ (Moody Crab Film Festival) 2022 లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు (Best Feature Film Award) తో సత్కరించారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి చాలా బాగుంది అని ప్రశంసించారు.
Jawan OTT : జవాన్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కాగా.. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిత్రంలోని కృష్ణుడి పద్యాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సురేష్ పల్లా మాట్లాడుతూ.. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మా ‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుడి పద్యాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సర్వలోక రక్షకుడు అయిన కృష్ణుడిని ఎవరు ఎప్పుడు ఎలా పిలువగలరు అని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకి శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఈ పద్యమన్నారు.
Krishnudu Padyam Release
Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్.. పవన్ అభిమానులకు పండగే..!
ఈ అచ్చ తెలుగు పద్యం కృష్ణుడి భక్తులకు పండగలా ఉంటుందని చెప్పారు. ఒక దశాబ్ద కాలంలో ఇలాంటి తెలుగు పద్య నాటకం తెలుగు సినిమాల్లో ఎన్నడూ రాలేదన్నారు. ఈ పద్యం కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడికి నైవేద్యం లాంటిదన్నారు. ఈ పద్యాన్ని 30 సంవత్సరాలుగా కృష్ణుడి వేషం వేస్తూ తెలుగు పద్యనాటకాలు చేస్తున్న గుమ్మడి గోపాలకృష్ణ విడుదల చేశారు. సినిమా ట్రైలర్, పద్యనాటకం చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నట్లు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.