Mega 3D Paint : ఒకే పెయింట్‌లో ముగ్గురు మెగా హీరోలు.. ఈ మెగా 3D పెయింటింగ్ చూసారా? ఆశ్చర్యపోవాల్సిందే..
తాజాగా కుప్పంకు చెందిన ఓ పెయింట్ ఆర్టిస్ట్ మెగా ఫ్యామిలీ 3D పెయింట్ ని గీశాడు.
Mega 3D Paint : అభిమానులు, కళాకారులు తమ హీరోలపై అభిమానం ఏదో ఒక రకంగా చూపిస్తూ ఉంటారు. సెలబ్రిటీలపై తమ ప్రేమను తమ ఆర్ట్ తో చూపిస్తూ ఉంటారు పలువురు కళాకారులు. తాజాగా కుప్పంకు చెందిన ఓ పెయింట్ ఆర్టిస్ట్ మెగా ఫ్యామిలీ 3D పెయింట్ ని గీశాడు.
ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు నాడు చిరంజీవి కోసం కుప్పంకు చెందిన పురుషోత్తం అనే ఆర్టిస్ట్ పూరి ఆర్ట్స్ పేరిట ఒక 3D పెయింట్ వేసాడు. ఈ పెయింట్ ముందు నుంచి చూస్తే చిరంజీవి కనిపిస్తాడు, ఓ పక్క నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, మరో పక్క నుంచి చూస్తే రామ్ చరణ్ కనిపిస్తారు. ఇలా ఒకే పెయింట్ లో ముగ్గురు హీరోలు వచ్చేలా అద్భుతంగా గీశాడు ఈ ఆర్టిస్ట్.
Also Read : Raina – Ram Charan : అతను డిఫరెంట్ లెవల్ యాక్టర్.. చరణ్ పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒకే పెయింట్ లో ముగ్గురు హీరోలను చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతూ భలే గీసాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కుప్పం కు చెందిన ఈ ఆర్టిస్ట్ గతంలో కూడా ఇలాంటివి పలు పెయింటింగ్ ఆర్ట్స్ గీశాడు. మెగా ఫ్యాన్స్ ఈ ముగ్గురు హీరోలు ఉన్న 3D పెయింట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ మెగా హీరోల 3D పెయింటింగ్ వీడియో చూసేయండి..